Pages

Bhaskara Satakam Padyalu - Eppu Dadrustataamahima

భాస్కర శతక పద్యం - ఎప్పు డదృష్టతామహిమ  
ఎప్పు డదృష్టతామహిమ  యించుక పాటిలు నప్పుడింపు సొం 
పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా 
నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ 
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!

తాత్పర్యము : పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు