Pages

పొడుపు కథలు

చిన్నోడి ఒంటినిండా నారబట్టలు - టెంకాయ
పళ్లు లేవు కానీ కరుస్తుంది - చెప్పులు
ఆ ఆటకత్తె ఎప్పుడూ లోపలే నాట్యం చేస్తుంది? నాలుక
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేల మీద కూలబడతాను- కెరటం
ఆకలేయదు, నీరు తాగదు, నేలని పాకదు... ఏమిటా తీగ? విద్యుత్తు తీగ
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. మామిడి పిందె
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? - తాటిచెట్టు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? - తేనెపట్టు
తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవలు బొమ్మ రాళ్లు. ఎవరు వారు? - పనస కాయ
మూత తెరిస్తే ముత్యాల పేరు.- దంతాలు
చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం. తియ్యగా నుండు.ఏమిటది? - కొబ్బరి కాయ
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు. - మిరప చెట్టు
ఊరంతటికీ ఒక్కటే దుప్పటి.ఏమిటది? - ఆకాశం
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. బాట వెంట పోయేవారిని కొంగు పట్టుకు లాగింది. - ముళ్లకంప
కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది. కానీ ఏనుగు కాదు. - నత్త 
పచ్చని ఆకు, తెల్లని అన్నం, నల్లని కూర. ఏమిటది? సీతాఫలం
కాళ్లు, చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.-ఉల్లిపాయ
పర్వతమున పుట్టి, పయనించి అడవుల పట్టణాలు దాటి పరుగులెత్తి సమసి పోదుతుదకు జలరాశిలో దూకి - తెలుగుబిడ్డ! నన్ను తెలియగలవా? -  నది
మనుషుల్లేని దేశాలు నీళ్లులేని సముద్రాలు  మంచులేని ధ్రువాలు ఏమిటది? - ప్రపంచపటం
పులినిపట్టి బోనులో పెట్టే మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరలచాటున దాక్కుంటున్నాడు? - దోమ 
రెక్కల్లేని పిట్ట. కళ్లు లేకపోయినా గురితప్పని దిట్ట. చందమామ ఒడిలో చేరాలని ఆరాటం .-  చంద్రయాన్ 
పాదములు నాల్గు గలవైన ప్రాణి గాను. చేరియుండును గణములు, శివుడ గాను. కలవలంకారములు పెక్కు, కాంత గాను తెలుగు బిడ్డనన్ను తెలియగలవె? - పద్యం 
గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు పగలంతా నిద్ర, రాత్రంతా జాగరణ. - ఎలక్ట్రిక్ బల్బ్ 
నూరు దుప్పట్లు కప్పుకుని మొద్దు నిదుర పోతుంది. దుప్పట్లను తీయాలంటే ఏడవటం తప్పదు మరి. - ఉల్లిగడ్డ 
తలపై పచ్చని కుచ్చుల టోపి కనిపించని ఎర్రని దొరసాని నాజూకుగ తయారై ఇంటింటా వంటింటికి నడిచొస్తుంది - క్యారెట్ 
హాయిగా కూర్చోపెట్టి ఇంటికి తీసుకుపోయే ఇల్లు, పరుగులు తీసే ఇల్లు. - బస్సు 
కొండలు దాటి, పట్టణాలు దాటి, అడవుల్లో నడచి మును ముందుకె సాగుతా, వెనుదిరిగే పనిలేదు, గమ్యం చేరేదాకా. -  నది
రెక్కలు ఉన్నాయి, పక్షి కాదు.చుక్కాని ఉంది, పడవ కాదు. కాళ్ళు లేవు, చకచకా కదిలిపోతుంది. - చేప 
వంకర లేని ఒకే పలువరస, కొరికానంటే కసకస,నున్నగ పరపర ముక్కలు చెక్కలు చేస్తా. -  రంపం
రెండు మెరిసే కొమ్ములతో మబ్బుల్లో తేలియాడుతుంటాను. చంద్రవంక 
చక చకా పోయేవి రెండు - కాళ్లు
గట్టెక్కి చూచేవి రెండు -  కళ్లు 
అంది పుచ్చుకునేవి రెండు - చేతులు
ఆలకిస్తుండేవి రెండు - చెవులు 
అడవిలో పుట్టాను, మేదరి ఇంట్లో మెలిగాను. వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. - వేణువు
ఆరు కాళ్ళుంటాయి తుమ్మెదను కాదు, తొండం ఉంటుంది, ఏనుగును కాను, దోమనూకాను, రెక్కలుంటై గాని, పక్షిని కాను. - ఈగ 
అన్ని ఋతువుల్లోను ఆదుకుంటాను, విచ్చుకుని నీపైన కాచుకుంటాను. - గొడుగు
అందరికీ నేనవసరం, నాకెవరూ అనవసరం,  కంటికి కనపడకున్నా, అందర్నీ అరుసుకుంటూ ఉంటాను.-  గాలి
సాచుకుని సావిట్లో పడుకుంటాను,ముడుచుకుని మూల కూర్చుంటాను.- చాప
వేయి కళ్ల పులి ఏట్లో  వేటాడబోయింది. - వల
లోన తీసి ఒకటి - అరటి
పైన తీపి ఒకటి - ఖర్జురం 
అంతా తీపి ఒకటి - బెల్లం 
ఏలక్కాయంత పగడాన్ని, ఎంత వాళ్లైనా పట్టలేరు, ఏనుగు కూడా మోయలేదు. -  నిప్పు 
అంతులేని తోటలో పూలే పూలు, చూసే వారేగాని కోసేవారు లేరు.- నక్షత్రాలు
మేసేది వేలంత, కూసేది పిడుగంత, తీసేది ప్రాణం తుపాకి 
బరువు మోతుగాని బండినేమియు గాను, కాళ్లు నాల్గు గలవు ఖరము గాను , చేతులున్నవైన చేయలేనే పని,తెలుగు బిడ్డ నన్ను తెలియగలవా? - కుర్చీ 
చలన శక్తిగలదు, జంతువు కాదది,చేతులెపుడు త్రిప్పు శిశువు కాదు, కాళ్లు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ.- గడియారం 
నీరు తాగి, నిప్పు మింగి, గుప్పు గుప్పున తేన్చుతుంది, - ఎందరెక్కి కూచున్నా ఇట్టే పరుగు తీస్తుంది.- రైలు 
చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు! - కళ్లజోడు
పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు.-  ఉల్లిపాయ
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. - మద్దెల
వెనక్కి వెనక్కి పోతే గెలుపు.ముందు ముందు కొస్తే ఓటమి.-  తాడులాగే ఆట
చెట్టుకు కాయని కాయ,ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ.- ఆవకాయ
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు,తియ్యని విందులు - సీతాఫలం 
తియ్యటి కోట,  కోట చుట్టూ కోటి మంది భటులు. ఏమిటది? తేనెపట్టు
ప్రాణంలేని నాలుగు కాళ్ల జంతువు. తన వీపు మీద మనల్ని మోస్తుంది. ఎవరది? మంచం 
ఆకాశంలో అందమైన పండు. రోజుకో రూపంలో ఉండు. ఒక్కో రోజు మాత్రం కనిపించకుండా ఉండు. ఏమిటది? చందమామ 
కడవలో మునిగింది, అటుఇటూ తిరిగింది. తల్లి నుంచి అన్నదమ్ముల్ని వేరుచేసింది. ఎవరది? కవ్వం
అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి? తేనే పట్టు
అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది? విస్తరాకు
అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను? టెలిఫోన్
అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు? ఆకలి
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!? చిటికెన వ్రేలు
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు? టెంకాయ
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది? తాటి చెట్టు
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?  కుండ, గరిట
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?  అత్తి చెట్టు
చెట్టుకు కాయని కాయ? ఆవకాయ
ఆకుల్లేని అడవుల్లో వంద దంతాల రాక్షసి? దువ్వెన
వానాకాలంలోనూ, ఎండాకాలం లోనూ విరిసే నల్లకలువ? గొడుగు 
వేలెడంత ఉండదు కానీ ఇంటిని కాపాడుతుంది? తాళంచెవి
ఎంత శుభ్రం చేసినా చెరిగిపోని మచ్చ? పుట్టుమచ్చ
వేడి నూనెలో అందమైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది. ఏమిటో చెప్పండి? జంతిక
నాలుగు కాళ్లతో కూర్చుంటుంది. రెండు కాళ్లతో నిల్చుంటుంది. ఎవరది? కాలం
నిత్యం ముందుకు వెళ్తుంది. .. వేగం పెంచమన్నా పెరగదు.  తగ్గించమన్నా తగ్గదు. ఏమిటది? మడత కుర్చీ
కాళ్లూ చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరు? టోపీ
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది? శంఖం
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? ఉల్లి
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? మురళి
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. దీపం వత్తి
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? తేలు
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది? ఎండ, వాన, చలి
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన? తాటి చెట్టు
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు? మంగలి
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి? సీతాకోక చిలుక
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది? ఉత్తరం
మోదం కాని మోదం? ఆమోదం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? పాలు, పెరుగు, నెయ్యి
రసం కాని రసం, ఏమి రసం? నీరసం
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? లవంగ మొగ్గ
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? తేనె పట్టు
మూత తెరిస్తే, ముత్యాల పేరు? దంతాలు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? దీపం
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? సూర్యుడు
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? పత్తి పువ్వు
లాగి విడిస్తేనే బ్రతుకు? ఊపిరి
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? వేరుశెనగ కాయ
జాన కాని జాన, ఏమి జాన? ఖజాన
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? ఉల్లిపాయ
ప్రాణం ఉన్నా నడవలేనిది. ఏమిటి? - గుడ్డు
 అల్లుడు వచ్చాడు. చొక్కా విప్పాడు. నూతిలో దూకాడు. ఏమిటది? - అరటి పండు 
ఊరంతా తిరిగినా గుమ్మంచూస్తే ఆగుతాయి. ఏమిటవి? - చెప్పులు
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను, ఆకాశంలో ఉండగలను  కానీ మేఘాన్ని కాను. ఎవరునేను? - చిలుక 
నీళ్లలో మునగదు. నిప్పులో కాలదు. కొట్టినా చావదు. ఏమిటది? - నీడ 
నీటి లో ఉంటె ఎగిసి పడతాను,నేలమీదికి రాగానే  కూలబడతాను. - కెరటం
గదినిండా రత్నాలు గదికి తాళం.  ఏమిటది? - దానిమ్మ పండు
ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది.  ఏమిటది? - విద్య
వేయి కన్నులు గల దేవునికి చూపు లేదు.  ఏమిటది? - మంచం
వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేధి.  ఏమిటది? - నది
మొగము లేనిది బొట్టు పెట్టుకుంది .  ఏమిటది? - గడప
తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు చేతిలో చల్లడం నోటితో ఏరుకోవడం. ఏమిటది? - పుస్తకం
మూత తెరుస్తే ముత్యాల సరాలు - పళ్ళు
ఎందరు ఎక్కిన విరగని మంచం. ఏమిటది? - అరుగు
పిల్ల చిన్నదాన కట్టిన చీరలు ఎక్కువ - ఉల్లిపాయ
పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు - విస్తరాకు
తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు. - దూది
చక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు ఏంటది? - కొబ్బరి బొండం
 అడవిలో పుట్టాను ఎదురింట్లో అలిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు. - మురళి
ఇంట్లో ముగ్గు బయట పువ్వు ఏంటది? - గొడుగు
ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. - వేరుశెనగ కాయ
కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది. ఏమిటది? - గురువింద గింజ
తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏంటవి? - విభూది పండు, ఉప్పు
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏంటది? - నిప్పు
నల్లకుక్కకు నాలుగు చెవులు ఏంటది? - లవంగం
 ఆటకత్తె ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది. ఏమిటది? - నాలుక
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది? - తాటిచెట్టు
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
ఆకు చిటికెడు, కాయ మూరెడు - మునగకాయ
అరచేతిలో లెక్కించలేని ఇళ్లు, వెళ్లే దారే కానీ, వచ్చే దారే లేదు? - జల్లెడ
పాము లేదు కానీ పుట్ట ఉంది, తల లేదు కానీ గొడుగు వేసుకుంది? -  పుట్టగొడుగు
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి అరుస్తుంది. ఏమిటది? - శంఖం
ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్లు నడస్తూనే ఉంటారు. ఎవరు వారు? - గడియారం లో ముల్లులు
చూస్తే గజిబిజి... తింటే కరకర.. - జంతికలు 
కన్ను ఉన్నా తల లేనిది? - సూది
కాళ్లు చేతులు ఉన్నా నడవలేనిది? -  కుర్చీ
ఒకటే తొట్టె రెండు పిల్లలు  - వేరు శెనగ
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ - ఒంటె
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. - శబ్దం
తలపుల సందున మెరుపు గిన్నె - దీపం
నల్లకుక్కకు నాలుగు చెవులు - లవంగం
తల్లి దయ్యం ... పిల్ల పగడం - రేగు పండు
అమ్మంటే దగ్గరగా వచ్చేవి... అయ్యంటే దూరంగా పోయేవి? - పెదవులు
ఆవిడ వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఇంతకీ ఎవరావిడ? - ఆవులింత
చీకటి లో వెలిగే చిరు దారి. (పాపిట)
అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారికాని వచ్చే దారే లేదు. ( జల్లెడ)
ఒకటే తొట్టె, రెండు పిల్లలు.( వేరు శెనగ)
ఎర్రటి పండుపై ఈగైనా వాలదు. ( నిప్పు కణిక)
గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది. గడగడా త్రాగుతుంది.కళ్ళు మూసుకుని, తననెవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు.(పిల్లి)
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. (ఉల్లిపాయ)
నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను,పెరిగి ఎర్రగా మారతాయా, చివరికి నల్లగా ఉంటా.నాతొ కళ్ళని పోలుస్తారు. (నేరేడు పళ్ళు)
తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు.అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. (మద్దెల)
ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే, మరొకటి నలుపునే చూస్తుంది. (ఆకాశం (రాత్రి, పగలు))
చూస్తే చిన్నోడు, వాడి ఒంటినిండా నారబట్టలు. (టెంకాయ)
అమ్మ కోసి ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది. తినటం పూర్తవగానే ఆకుపచ్చ రంగుకొచ్చింది. ఏమిటది?(పుచ్చకాయ)
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి( ఉంగరం)
నన్ను వేసే వాళ్ళే గాని తీసేవాళ్ళు లేరు …నేను ఎవరిని?. (గోడకి సున్నం)
తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది. (పుట్టగొడుగు)
పోకంత పొట్టి బావ, కాగంత కడవ మోస్తాడు. (పొయ్యి)
ఒక ఇంటిలో ఒక పిల్ల, ఆ ఇంటికి కిటికీలు, తలుపులు లేవు. విరగ్గొట్టుకునే బైటికి రావాలి. మళ్ళీ లోపలి పోలేదు. ఏమిటది? (కోడిగుడ్డు)
నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు. (చెప్పులు)
నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా. (బ్లాక్ బోర్డు)
అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు. (కంచం)
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. (శబ్దం)
నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని? ( స్పాంజి)
నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు, ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు, ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని? ( ప్రపంచ పటం (మ్యాప్))
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని? (రామ చిలుక)
కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను., తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని? (బొగ్గు)
నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు. (సమయం)
వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను, చీకటి పడితే మాయమౌతాను. (నీడ)
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేలమీద మాత్రం కూలబడతాను. (కెరటం)
నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే, లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. (అగ్ని)
అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు. (పేరు)
ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది. (చెప్పులు)
నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తా. ( మైకు)
దాని పువ్వు పూజకు పనికిరాదు, దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదు,కానీ దాన్ని అందరూ కోరతారు. (చింత పండు)
హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దు, ఎన్నడూ ఆడొద్దూసుమా!. ( అబద్దం)
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ!. (ఒంటె (ఎడారి ఓడ))
ఎంతెంతో వింత బండి, ఎగిరి ఎగిరి పోయేసుమండీ! మండుతూ మండుతూ మాయమయ్యెను. (రాకెట్ )
చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నది. 
పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. (సీతాకోక చిలుక)
చూస్తే గజి బిజీ, తింటే కరకర. (జంతిక)
తలకు తోకకు ఒకటే టోపీ (పెన్ను)
చారెడు కుండలో మానెడు పగడాలు. (దానిమ్మ పండు)
కన్ను ఉన్నా తలలేనిది. (సూది)
కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు. ( నవారు మంచం)
ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. (కాకర కాయ)
సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. (అరటిపండు)
తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు, 
కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు,
పాకి పోవు చుండు, పాము కాదు. (రైలు)
తొడిమ లేని పండు, ఆకు లేని పంట. (విభూది పండు)
నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడేస్తుంది. (చిచ్చుబుడ్డి)
చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము. (పొట్లకాయ)
అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది,వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. (మురళి)
కిట కిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు మూసిన చప్పుడు కావు. (కంటి రెప్పలు)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (కవ్వం)
నేను నడుస్తూనే ఉంటా... నన్ను ఎవరూ ఆపలేరు? (కాలం)
ఆకలేయదు, నీరు తాగదు, నేలపై పాకదు, ఏమిటి ఆ తీగ? (విద్యుత్ తీగ)
మూట విప్పితే ముత్యాలు.... ఏమిటది? (దానిమ్మ పండు)
అన్నీ వేసి చూడు, నన్నలా వేసి చూడు!ఏమిటది? (ఉప్పు)
తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి,
ఆడని బంతి...... ఏమిటది? (జాబిలి)
మా తాత దొడ్డిలో మంచి ఎద్దుల మంద, 
ఎద్దులు పడుకుంటే పగ్గాలు మేస్తాయి.... ఏమిటది? (గుమ్మడిపాదు)
నిగనిగలాడే నిర్మల వస్తువు, 
భుగభుగ మండే పరిమళ వస్తువు, 
నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుకు మండు.... ఏమిటది? (కర్పూరం)
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే 
చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. (మద్దెల)
వెనక్కి వెనక్కి పోతే గెలుపు. 
ముందు ముందు కొస్తే ఓటమి. (తాడులాగే ఆట(Tug of War))
చెట్టుకు కాయని కాయ 
ఎర్రఎర్రగా పెట్టే కాయ 
ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ. (ఆవకాయ)
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. 
తియ్యని విందులు.  (సీతాఫలం)
పండుకు పన్నెండు తొనలు 
తొనకు ముప్పై పిక్కలు 
పదిహేను తెలుపు - పదిహేను నలుపు (కృష్ణ పక్షం, శుక్ల పక్షం)
నోరులేని పిట్ట, తోకతో నీళ్లు తాగుతుంది. (వత్తి)
నేలంతా నాకి మూలకేగి కూర్చుంటుంది. (చీపురు)
నాలుగు రోళ్లు నడవంగ 
రెండు చేటలు చెఱగంగ
అబకా ఒక్కటి ఆడంగ
చక్కని దొరలు ఎక్కేరు! (ఏనుగు)
నల్లని చేను మధ్యగా తెల్లని ఇరుకు బాట. (పాపిట)
కాళ్ల కింద నలిగాను. 
చక్రంపై తిరిగాను. 
చేతుల్లో ఒదిగాను
అగ్గిలో పడ్డాను. 
మనిషి ఇంటికెళ్లాను 
చెయ్యి జారితే పుట్టింటికే ఇక! (కుండ)
గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారిని వడ్డించే బొమ్మ. (తేలు)
కిటకిట తలుపులు 
కిటారి తలుపులు 
ఎప్పుడు మూసిన చప్పుడు కావు (కంటిరెప్పలు)
సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. (కొబ్బరి నీళ్లు)
అందంగా కన్నుల విందుగా అప్పుడప్పుడు ఆకాశంలో దర్శనం ఇస్తుంది. ఎండావానల సయ్యాట ఇది!(ఇంద్రధనస్సు)
పన్నెండు కొమ్మల మాను, కొమ్మకు ముప్పై ఆకులు (సంవత్సరం, నెలలు)
ఏ రాయి వద్దన్నా, ఈ రాయి కావలసిందే (ఉప్పురాయి)
ఊరంతటికీ ఒకటే దుప్పటి (ఆకాశం)
సంపాదన ఒకరిదీ,
అనుభవం ఒకరిదీ,
ఇంట్లో కాదు, వంట్లోనే! (చేతులు, నోరు)
పుట్టెడు గులక రాళ్ళల్లో ఒక మెరుపు రాయి(చుక్కల్లో చంద్రుడు)
ఎండలో నడిచి ఇంటికి వచ్చి గడప అవతల ఇద్దర్నీ 
గడప మూల ఒక్కర్నీ కాపలా ఉంచి పడుకున్నాడు. (చెప్పులు, గొడుగు)
అట్లు కాని అట్లు. పెద్దలు పెడతారు. పిల్లలు తింటారు. ఏమిటవి? (చీవాట్లు)
నేను ఎక్కువయ్యే కొద్దీ మీ చూపు మందగిస్తుంది. నా పేరేంటి? (చీకటి)
పైన పసుపు, లోన తెలుపు, మధ్యలో గులకరాళ్లు, పులుపు నీళ్ళు. నేనెవరో చెప్పగలరా? (నిమ్మకాయ)
వీధి పక్కన ఎర్రచొక్కా అబ్బాయి. ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికీ తోచింది వారు తినిపిస్తారు. ఎవరది? (పోస్ట్ బాక్స్)
ఆకుపచ్చగా ఉంటాను. నన్ను తినరు కానీ నన్ను చంపి నల్లని నా పిల్లల్ని తింటారు. నేనెవర్ని?(యాలకలు)
వింతాకాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? (ఆవులింత)
కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది. ఏమిటది? (కలం)
గొప్ప మాటకారి. గడపదాటి బైటికి రాదు గానీ మాట్లాడుతూనే ఉంటుంది? (నాలుక)
వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది. ఏమిటది? (సూది - దారం)
కాళ్లు నాలుగున్నా కదలలేదు
చేతులు రెండున్నా ఏమీ చెయ్యలేదు. ఏమిటది? (కుర్చీ)
చెయ్యని కుండ
పొయ్యని నీళ్లు, పెట్టని పిలక. ఏమిటది? (టెంకాయ)
'అమ్మా' అంటే దగ్గర కొచ్చేవి,
'నాన్నా' అంటే దూరంగా పోయేవి, ఏమిటవి? (పెదవులు)
నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి పోతుంది,
ఎక్కడ అనుకున్నామో అక్కడ తాకి తీరుతుంది. ఏమిటది? (రాకెట్)
నవ్విన నవ్వును, ఏడ్చిన ఏడ్చును
కొట్టిన కొట్టును. ఏమిటది? (అద్దంలో బొమ్మ)
ఎంత దూరం నెట్టితే అంత దగ్గరవుతుంది.
గాలిలోనే తేలుతూ కదలాడుతుంటుంది. ఏమిటది? (ఊయల)
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాడు
నరుడె వాహనంబు నడువ లేదు
తాను ప్రాణి కాదు తవిలి ప్రాణుల జంపు
దీని భావమేమి తిరుమలేశ? (వల)
నది ఒడ్డున అందాలొలికించే పాలరాతి బొమ్మ. ఏమిటది? (తాజ్ మహల్)
వెయ్యిమందికి ఒకటే మొలతాడు. ఏమిటది? (చీపురు కట్ట)
వేదంలో ఉంది పురాణంలో లేదు,
మనస్సులో ఉంది ధనుస్సులో లేదు,
మూడక్షరాల ఆ కవి పేరేమిటి? (వేమన)
కాలం వస్తేనే గళం విప్పుతుంది.
వెక్కిరిస్తే రెచ్చి పోతుంది. ఏమిటది? (కోకిల)
సన్న తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద,
అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఏమిటది? (అరటి పండు)
పచ్చని పెట్టెలో తెల్లని విరులు
తెచ్చుకోబోతే గుచ్చుకుంటాయి. ఏమిటవి? (మొగలి పువ్వు)
పోషణలో ఉంది కాని, దూషణలో లేదు.
మడతలో ఉంది కాని, మడమలో లేదు.
నడకలో ఉన్నా తడకలో లేదు.
ఒక మహనీయ కవీశ్వరుని పేరు. ఎవరు వారు? (పోతన)
పడుకోగానే వచ్చి పక్కలో జేరుతుంది.
చెవిలో సంగీతం వినిపిస్తుంది, గిచ్చుతుంది అదిలిస్తే పారిపోతుంది. ఏమిటది? (దోమ)
సరస్సులో తేలియాడు తెల్లని పుష్పం.
కదలాడే స్వచ్ఛమైన పుష్పం కలువ కాదు,
తెల్లని పద్మం కాదు. ఏమిటది? (హంస)
ఒకటి పట్టి ఎత్తితే
రెండు ఉయ్యాల లూగుతాయి. ఏమిటది? (త్రాసు)
చీకట్లో ఎగురుతూ తిరుగుతుంది, పక్షి కాదు.
ఆగి ఆగి మెరుస్తుంది నక్షత్రం అసలే కాదు. ఏమిటది?(మిణుగురు పురుగు)
ఎనిమిదేనుగులున్న దర్బారు
ఎదురులేక ఏలుకున్న దర్బారు. ఏమిటది?(కృష్ణదేవరాయల దర్బారు)
మూరెడు పిట్టకు బారెడు తోక.
ఎగిరి ఎగిరి ఎటో ఎటో పోతుంది. ఏమిటది? (గాలిపటం)
మూడు కాళ్లతో ముందుకు వెళ్తుంది. కానీ వెనక్కు మాత్రం రాలేదు. ఏమిటో చెప్పండి? (కాలం)
ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే? (ఆవులింత)
జానెడు పొడుగుంటుంది. దాని పొట్టనిండా ముత్యాలే. ఎవరది? (బెండ)
ఎనిమిది రెక్కల పువ్వు. కావాలంటే విచ్చుకుంటుంది, వద్దంటే ముడుచుకుని మొగ్గ అవుతుంది. ఏమిటది? (గొడుగు)
పనిలో ఉన్నా కానీ పదిలో లేను
ఋతువులో ఉన్నా కానీ క్రతువులో లేను
తావులో ఉన్నా కానీ తారులో లేను
అయితే ఇంతకీ నేను ఎవరిని?  (పరువు)
వరంలో ఉన్నా కానీ భారంలో లేను
జారులో ఉన్నా కానీ జాములో లేను
తాడులో ఉన్నా కానీ తారులో లేను
అయితే ఇంతకీ నేను ఎవరిని?  (వరుడు)
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్ట గొడుగు)
అంగుళం ఆకు అడుగున్నర కాయ? (ములక్కాయ)
ఆకాశంలో పాములు? ఏమిటవి?(పొట్లకాయలు)
మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్యా? (చెప్పులు)
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది! ఏమిటది? (తాటిచెట్టు)
మీ అక్క తమ్ముడిని కాదు, కానీ మీ అందరికీ మేనమామనే! నేనెవరిని? (చందమామ)
యంత్రం కాని యంత్రం ఏమిటి? (సాయంత్రం)
సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు? ఏమిటది? (త్రాసు)
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? (తాటిచెట్టు)
రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గానీ లెక్కేసే వారే లేరు? (చుక్కలు)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు? (పిల్లనగ్రోవి) 
దాస్తే పిడికిలిలో దాగుతుంది....... తీస్తే ఇల్లంతా జారుతుంది? (దీపం వెలుగు)
ఎందరు ఎక్కినా విరగని మంచం? (అరుగు)
ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి? (దీపం)
ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది? (చీపురు)
తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది. (ఉత్తరం)
తెల్లని పోలీసుకు నల్లని టోపీ (అగ్గిపుల్ల)
పళ్లున్నా నోరు లేనిది? (రంపం)
చిటపట చినుకులు, చిటారు చినుకులు, ఎంత రాలినా చప్పుడు కావు? (కన్నీళ్లు)
నిలబడితే నిలుచుంటుంది, కూర్చుంటే కూలబడుతుంది. (నీడ)
ముక్కు మీదకు ఎక్కుతుంది. ముందర చెవులు నొక్కుతుంది. సోకులు పోయే టక్కులాడి జారిందంటే ...... పుటుక్కుమంటుంది? (కళ్లజోడు)
పిడికెడంత పిట్ట అరచి గోల పెడుతుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది?
(సెల్ ఫోన్ )
అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది?(అగ్గిపెట్టె)
అంగుళం ఆకు, అడుగున్నర కాయ. ఏమిటది?(ములక్కాయ)
అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే. ఏమిటది?(నక్షత్రాలు)
అందమైన అప్పన్న, మూతిలాగి నాకన్నా. ఏమిటది?(మామిడి పండు)
అడుగులు ఉన్నా కాళ్లు లేనిది. ఏమిటది?(గజం బద్ద)
అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. ఎవరు వారు?(సూర్యుడు, చంద్రుడు)
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్టగొడుగు)
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది?(ఈత గెల)
అడవిలో అక్కమ్మ ఆసుబోసింది. ఏమిటది?(సాలీడు)
అడవిలో పుట్టాను
మేదరింట్లో మెలిగాను
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు. ఏమిటది?(మురళి)
చెక్కని స్తంభం - చేతి కందదూ,
చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు,
చెయ్యని సున్నం - తియ్యని బెల్లం. ఏమిటది?(కొబ్బరి)
చూస్తే ఒకటి,
చేస్తే రెండూ,
తలకూ తోకకూ ఒకటే టోపీ చెప్పండీ, ఇది చెప్పండి(కలం)
చూపు లేని కన్ను సుందరమౌ కన్ను,
తోట లేని కన్ను తోక కన్ను,
కన్ను గాని కన్ను కాలకంఠుని కన్ను. ఏమిటది?(నెమలి)
చిటపట చినుకులు కురియంగా,
సీతాదేవి పుట్టంగా,
లంకాదీపం పెట్టంగా,
రావణుని తల కొట్టంగా,
చిలప చిలప నీళ్ళ లో సీతమ్మ జడలంట,
భూమంటే నెల్లూరు కోటంట,
కోటలో రాజు పెళ్ళాం కొలువంట. ఎవరు నేను?(అరటి)
ఎనిమిది చేతుల ఏబ్రాసీ,
ఎప్పుడు తిరిగే సోబ్రాసీ,
వెన్నున జంజె వ్రేళ్ళాడు తీసిన కొద్దీ తెర్లాడు(రాట్నం)
ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు?
(జవాబు : చింతకాయలు)
తలుపుల లోపల మెలికల పాము.
ఏమిటది?(జవాబు :నాలుక)
పొడవుగా పండే పంటను పొడిగా వాడతాం.
ఏమిటది?(జవాబు :చెక్కెర)
గుండ్రటి భవనంలో బోలెడన్ని తెరలు,
తెరల చాటున ఎర్ర సిపాయిలు.  ఎవరువారు?(జవాబు :దానిమ్మ పండు)
బైటది పారేస్తాం లోపలది తింటాం.
బైటది తింటాం, లోపలది పారేస్తా. ఏమిటది?(జవాబు :మొక్కజొన్న)
1. ఆకాశంలో అరవై గదులు, గది గదికో సిపాయి.
 సిపాయికో తుపాకి?
ఏమిటది? (జవాబు : తేనెతుట్టె)
2. ఆకాశాన ఎగురుతుంది, పక్షి కాదు.
మనషుల్ని ఎగరేసుకుపోతుంది, గాలి కాదు.
ఏమిటది? (జవాబు : విమానం)
3. ఆకాశాన పటం, కింద తోక?
ఏమిటది? (జవాబు : గాలి పటం)
4. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు
జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఏమిటది? (జవాబు : దువ్వెన)
5. ఆకు లేయదు, నీరు తాగదు, నేలను పాకదు.
ఏమిటా తీగ?  (కరెంటు తీగ)
6. 'పోషణ' లో ఉంది, 'దూషణ' లోలేదు;
 'మమత' లో ఉంది, 'మమకారం' లో లేదు;
'మన' లో ఉంది, 'మాట' లో లేదు. ఈ పొడుపు కథలోని కవి  పేరు?
(జవాబు : పోతన)
చూసింది ఇద్దరు,
కోసింది అయిదుగురు,
తిన్నది 32 మంది
ఏమిటది?(జవాబు : కళ్ళు, వేళ్లు, పళ్ళు)
ఒక కన్ను కలది కాకి కాదు,
ఒక కన్నం ఉంది పుట్ట కాదు,
ఏమిటది?(జవాబు : సూది)


అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ 
చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది?(ఊయల)
పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది?(చిలుక)
ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ?(వాసన)
పిఠాపురం చిన్నవాడా , పిట్టల వేటగాడా  బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు?(కోడి గుడ్డు )
మూతి వేలెడు, తోక బారెడు? (సూది , దారం)
ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ?(వెలగ పండ్లు)
ఆకు బారెడు తోక మూరెడు ?(మొగలి పువ్వు)
ఆకు చిటికెడు కాయ మూరెడు?(మునగ కాయ)
చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు?(అద్దం)
అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది.(ప్రమిద)
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన(రామచిలుక)
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి)
కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట)
కన్నులు ఎర్రగా ఉంటాయి , రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది,   భూతం కాదు
చరచర పాకుతుంది పాముకాదు ( రైలు )
కత్తులు లేని భీకర యుద్ధం , గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం)
కతకత కంగు ,మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు)
పైనొక పలక , కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక)
అమ్మ కడుపున పడ్డాను,  అంతా సుఖాన ఉన్నాను ,నీచే దెబ్బలు తిన్నాను,
నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను(పిడక)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, మహలక్ష్మిలాగుంది.(గడప)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.(చల్లకవ్వం)
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు)
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ,ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది?(శంఖం)
ముగ్గురన్నదమ్ములు , రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు?(గడియారం ముళ్ళు)

2 comments:

  1. అంకం నానదాలు

    ReplyDelete
  2. ఎనిమిది చేతులు ఉంటాయి కానీ ఒక్కటి కాలు ఉంటుంది ఏమిటిది

    ReplyDelete

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు