Pages

యుక్తి లెక్కలు

1. కొందరు బ్రాహ్మణులు అడవి మార్గముగా ఏదో ఊరికి పోవు చుండిరి. నడిదారిలో దొంగల గుంపొకటి అడ్డగించినది. ఎంత బతిమాలినను వదలలేదు. దొంగలు వారి దగ్గరలోనే ఉన్న అంకాళమ్మ గుడికి లాగుకొనిపోయి, బాధింపసాగిరి. అంతలో అంకాళమ్మ వారి యెదుట ప్రత్యక్షమై 'మీలో సగము మంది నాకు బలికండు, లేకున్న మిమ్మందరిని భక్షింతు' నన్నది. దొంగలున్నది పదునైదుమంది; బ్రాహ్మణులను సరిగా పదునైదుమందే. మరి బలికావలసిన పదునైదుమంది ఎవరన్న ప్రశ్న వచ్చెను. దొంగలందరిని బలి యిచ్చి బ్రాహ్మణులందరిని బ్రదికింపవలనని ఒక బ్రాహ్మణుని ఎత్తు. 'తల్లీ! నీవు అచ్చము బ్రాహ్మణులను గాని, అచ్చము దొంగలను గాని బలికొనుట ధర్మము కాదు. మేమందరము వరుసగా నిలుచుందుము. నీవు లెక్క వరుసను ప్రతీ వరుసలోను తొమ్మిదవ వానిని బలితీసుకొ' మ్మన్నాడు. ఆ విధముగా అందరిని నిలువబెట్టినాడు. బ్రాహ్మణులందరి ప్రాణములు నిలిపినాడు. దొంగలందరి ప్రాణములు తీసినాడు. ఏ వరుస ప్రకారము
అందరను నిలువబెట్టినాడు?(జవాబు : బ్రాహ్మణుడు తన వారిని, దొంగలను కలిపి నిలబెట్టిన క్రమము (X బ్రాహ్మణుడు O దొంగ అని అనుకుందాము.
X X X X O O O O O X X O X X X O X O O X X O O O X O O X X O)
2. 1932 లో నా వయస్సు నేను పుట్టిన సంవత్సరం లోని చివరి రెండంకెలంత. ఈ తమాషాను నేను మా తాతయ్యకు చెప్పగా తన వయస్సు కూడా ఈ మాదిరేయున్నదన్నాడు. ఇది అబద్దమన్నాను. కాని నిజమని తాతయ్య నిరూపించినాడు. ఇది ఎట్లు? మరి 1932  లో నా వయస్సెంత? మా తాతయ్య వయస్సెంత?(జవాబు : ఇద్దరిది కూడా నిజమే. మనుమడు 20 వ శతాబ్దివాడు. అందువల్ల అతడు పుట్టిన సంవత్సరం 19 తో ఆరంభమగును. 1932 లోని చివరి రెండంకెలు సమానముగా భాగించిన 16 వచ్చును. అనగా మనుమడు పుట్టినది 1916 లో. అప్పుడు 1932 లో వాని వయస్సు 16 సంవత్సరములు)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు