Pages

Telugu Malika - మంచి పనులు

మంచి పనులు 
1. అన్ని జీవములను నీవలనే భావించుము.

2. ఆకలి గొన్నవానికే అన్నం పెట్టుము.

3. ఈడు వచ్చిన కొడుకును జోడుగా చూడుము.

4. పరుల సొత్తు మట్టిపెళ్ళగా ఎంచుము.

5. పిల్లవారి నుండి కూడ హితవు వినదగును.

6. ప్రాణముకన్న  మానము ఎక్కువగా ఎంచుము.

7. రాత్రిపూట పాలు పోసుకొని అన్నము తినుము.

8. సజ్జనుల యెడ ప్రీతి వహింపుము.

9. సత్పురుషులతో సహవాసము చేయుము.

10. సేవకుల పై దయగలిగి యుండుము.

11. స్వజనుల పై దాక్షిణ్యము చూపుము

12. ఆపద వచ్చినప్పుడు ఆకులపాటు చెందవద్దు.

13. ఉన్నను లేకున్నను మర్మము(రహస్యము) బయట విడువకుము.

14. నౌఖరిలో నమ్మకముగా మెలుగుము.

15. పెద్దలు వచ్చినప్పుడు దిగ్గున లేచి భక్తి సలుపుము.

16. హితుల మేలు మరువకుము 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు