Pages

నిత్యసత్యాలు - ఆణిముత్యాలు

నిత్యసత్యాలు - ఆణిముత్యాలు 
ధర్మాన్ని మనం రక్షిస్తే - ధర్మం మనలను రక్షిస్తుంది. 
జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి. 
చేసిన మేలు మరచిపో - పొందిన మేలు గుర్తించుకో 
శ్రేష్టకర్మల జ్ఞానమే భాగ్యరేఖలు గీసే కలము
చితి నిర్జీవులను కాలుస్తుంది - చింత సజీవులను దహిస్తుంది 
జీవితం కరిగిపోయే మంచు - ఉన్నంతలో నలుగురికి పంచు 
తినటం కోసం జీవించకు - జీవించటం కోసం తిను
మణుగుల కొద్ది మాటల కన్నా - చిన్నమెత్తు ఆచరణ మిన్న 
కష్టాలు ఒంటరిగా రావు - అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి 
ఆచరణ లేని ప్రచారం పంట పండని భూమి వంటిది 
సంసార సాగరం దాటాలంటే - సంస్కారముల పరివర్తన కావాలి 
కోరికలు పెరిగే కొలది ఆనందం తగ్గుతుంది 
మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది 
శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు 
వాంఛల త్యాగమే మహోన్నతికి మార్గము 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు