Pages

కనుక్కోండి చూద్దాం

భక్తిని కలిగిన దామెట
శక్తిని పూజించుతుంది శాంతముగలదే
యుక్తిగ రాలును చేర్చుము
భక్తి గలిగినామె ఎవరు బంగరు మొగ్గా(జవాబు : భక్తురాలు)
నిలిచిన పాసింజర్ లో
నిలకడ గా జూడ నుండె నిలచెడి దుదయం
నిలచెడి దది నాలుకపై
పలుకుమిపుడు దాని పేరు బంగరు మొగ్గా( జవాబు : పాచి)
'కురిసింది వాన' లోనిది
మరియమ్మట చూచి పలికె మా వంటింట్లో
పరికించ పొయ్యి ప్రక్కది
మరియమ్మలు చూచినదేంటి మాటల మొగ్గా?(జవాబు ; సింకు)
విభజన పేజిలందును(న)
విభజన తో పాఠముండు విభజన చూసే
శుభ అదిరాలు గలదనెను
శుభ చూచినవేంటి చెప్పు సోకుల మొగ్గా (జవాబు : పేరాలు)
కొండలకు చివరనుండును
ఉండును అని రాలు కలిగి ఉండును చివరే
కొండల కవి ఏనుగునో
బండను దిగి వచ్చు చెప్పు బంగరు మొగ్గా (జవాబు : శిఖరాలు)
వీటి కొరకే తపస్సులు
వాటికి చివరుండు వరాలు వారడిగెడివే
వాటిని దేవుడు ఇచ్చును
వీటిని చెప్పాలి నువ్వు విలువగు మొగ్గా (జవాబు : వరాలు)
శ్రీమతి కనకయ్యను
మామకు కనిపించినాది మకతిక దాన్నే
రాముడు సరిజేసి పలికె
రాముడు పలికిన దేంటి రంగుల మొగ్గా, కనుక్కో?(జవాబు : తికమక)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు