Pages

Bhaskara Satakam Padyalu - Edde Manushyude

భాస్కర శతక పద్యం - ఎడ్డెమనుష్యుడేమెఱుఁగు 
ఎడ్డెమనుష్యుడేమెఱుఁగు  నెన్ని దినంబులు గూడి యుండినన్ 
దొడ్డగుణాఢ్యునందుఁ గల తోరపు వర్తన లెల్లఁ బ్రజ్ఞ నే 
ర్పడ్డ వివేకిరీతి రుచిపాకము నాలుక గా కెఱుంగునే 
తెడ్డది కూరలో గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!

తాత్పర్యము : కూరలోనుంచి గరిటెనటునిటు ఎన్నిసార్లు త్రిప్పనను అది దాకరుచిని తెలిసికొనలేదు. ఆ రుచి ఎట్లున్నదో నాలుకకే తెలియును. అట్లే యొక గుణవంతునివద్ద అవివేకి యొక్క డెన్ని దినములు కలిసియుండినను అతని గొప్ప (గుణము) ప్రవర్తనము తెలిసికొనలేడు. వివేకియైనవాడు గుణవంతునితో కలిసినట్లుయినచో నతడే యా గుణవంతుని ప్రవర్తనమును గ్రహించును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు