Pages

కీచురాళ్ళు ఎందుకు అరుస్తాయి? - కారణం ఏమిటి

కీచురాళ్ళు ఎందుకు అరుస్తాయి? - కారణం ఏమిటి

మనం చీకటిగా ఉన్న (లేదా) నిర్జనంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు కీచురాళ్ల శబ్దం మన చెవులకు సోకుతుంది. సినిమాల్లోనూ కూడా ఈ శబ్దాలను మనం వింటూనేఉంటాము. ఇంతకీ అవి ఎందుకు అలా అరుస్తాయంటారు? కీచురాళ్ళు అనేవి గొల్లభామల జాతికి చెందిన ఒక రకమైన కీటకాలు. వీటిలో కేవలం మగవి మాత్రమే సాధారణంగా అరుస్తాయి. అరవడమంటే మనలా నోటితో కాకుండా, ఒక రెక్క అంచులో మరో రెక్క పైని ముడుతల్ని అతివేగంగా రుద్దడం ద్వారా అవి అలాంటి శబ్దాలను సృష్టిస్తాయి. కీచురాళ్ళు సృష్టించే ధ్వనులకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడ కీచురాయిని ఒక మగ కీచురాయి పిలిచేటప్పుడు, 2 మగ కీచురాళ్లు పరస్పరం పోట్లాడుకునేటప్పుడు, ఇంకా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఇవి అరుస్తుంటాయి. ప్రస్తుతం మనం ఎంతో ఇష్టమైన ఆడుతున్న ఆట క్రికెట్  ఒకప్పుడు కూతతో కూడుకొని ఉండేది. అందుకని ఆ ఆటకు ఈ కీటకం పేరు మీదుగానే క్రికెట్ అనే పేరు వచ్చింది

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు