Pages

భాస్కర శతక పద్యాలు - అదను దలంచి

భాస్కర శతక పద్యాలు - అదను దలంచి 

          అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ 
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ 
మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే 
పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా. 

తాత్పర్యము : భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు