Pages

భాస్కర శతకం - అంగన నమ్మరాదు

భాస్కర శతకం - అంగన నమ్మరాదు 
అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే 
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా 
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి 
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా 

తాత్పర్యము : భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు.  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు