Pages

When it comes to noise in front of the TV. Why?

టీవీ పెట్టగానే ముందు శబ్దం వస్తుంది. ఎందుకు?

కాంతివేగం ధ్వనివేగం కన్నా అనేక రెట్లు ఎక్కువ. మరి మనం టీవీని పెట్టినప్పుడు ముందు శబ్దం వచ్చి తర్వాత బొమ్మ కనపడుతుంది ఎందుకంటే 
                                                    దీనికి కారణం మన ఇంట్లో ఉండే టీవీలో జరిగే ప్రక్రియ. ముందు శబ్ద, దృశ్యాన్ని టీవీ కెమెరాలు చిత్రీకరించేటప్పుడు శబ్ద సంబందిత విషయాలు కూడా ఒక మైక్రోఫోన్ సహాయంతో ఒకే కాలం లో రికార్డ్ అవుతాయి. ఆ వివరాలు దూర ప్రాంతాలకు ప్రసారమయ్యే ముందు దృశ్య, శబ్ద వివరాలను విద్యుత్ స్పందనాలుగా మారుస్తాయి. ఆ తర్వాత వాటిని విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తారు. ఈ 
తరంగాల వేగం కాంతి తరంగాల వేగంతో సమానంగా ఉంటుంది. ఇలా ప్రసారమయి వాతావరణంలో పయనించిన తరంగాలను ఇంటిలో ఉండే టీవీ 'ఏంటినా' గ్రహిస్తుంది.
                                                              మనం టీవీ పెట్టినప్పుడు ఏంటినా గ్రహించిన విద్యుదయస్కాంత తరంగాలు టీవీలోకి వస్తాయి. టీవీ ఉండే పరికరాలు, విద్యుదయస్కాంత తరంగాలును విద్యుత్ స్పందనాల రూపంలోకి మారుస్తాయి. టీవీలో శబ్ద, దృశ్యాలకు సంబంధించిన విషయాలకు వేర్వేరు విభాగాలు ఉంటాయి. దృశ్య విభాగాన్ని 'పిక్చర్ ట్యూబ్' (దీనిని కాథోడ్ కిరణాల ట్యూబ్ అని కూడా అంటారు) ఎలక్ట్రాన్ కిరణాల రూపంలోకి మార్చి ఆ కిరణాలను టీవీ తెరపై పడేటట్లు చేసి మనకు బొమ్మ రూపంలో కనపడేటట్లు చేస్తుంది. పిక్చర్ ట్యూబ్ నుంచి ఎలక్ట్రాన్ కిరణాలు ఆ ట్యూబ్ లో ఉండే ఫిలమెంట్ వేడైన తర్వాతే వెలువడుతాయి. అలా వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. కానీ టీవీలోని శబ్ద విభాగం శబ్ద తరంగాలను వెలువరించడానికి ఏమాత్రం సమయం పట్టదు. విద్యుత్ అయస్కాంత తరంగాలు శబ్ద విభాగాన్ని చేరీచేరక ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శబ్ద తరంగాలు వెలువడతాయి. అందువల్లనే టీవీ పెట్టగానే ముందు మనం శబ్దంను వింటాము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు