Pages

నరసింహ శతకం - మందుడనని నన్ను


సీ. మందుడనని నన్ను - నిందజేసిన నేమి? - నా దీనతను జూచి - నవ్వనేమి?
     దూరభావము లేక  - తూలనాడిన నేమి? - ప్రీతిసేయక వంక - బెట్టనేమి?
     కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి? - తీవ్రకోపము చేత - దిట్టనేమి?
     హెచ్చుమాటల చేత - నెమ్మలాడిన నేమి? - చేరి దాపట గేలి - సేయనేమి?
తే. కల్పవృక్షము వలె నీవు - గల్గ నింక - బ్రజల లక్ష్యంబు నాకేల - పద్మనాభ!
     భూషణవికాస! శ్రీధర్మ - పుర నివాస! - దుష్ట సంహార ! నరసింహ ! - దురితదూర!

తాత్పర్యము : ఓ నారసింహ స్వామీ! మందబుద్ధననీ, దీనుడననీ నిందించినా, నవ్వినా, ఆలోచించకుండా కసిరి కొట్టినా, మేలుచేయక తప్పులెంచినా, తూలనాడినా, తిట్టినా, కాని మాటలన్నా, వెక్కిరించినా, యీ ప్రజలు ఏమి చేసినను, ఓ పద్మనాభా! కల్పవృక్షము వంటి  నీవు నాకు అండగా ఉండగా వాళ్లందరినీ లక్ష్య పెట్టు పని నాకెందుకు స్వామీ!

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు