Pages

వేమన పద్యం - వేమననగ యోగి వెలసె లోకములోన


వేమననగ యోగి వెలసె లోకములోన
పూజలిడుడు పుణ్యపురుషులార!
పూజలిడినయంత భుక్తిముక్తుల నిచ్చు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము : ఓ పుణ్యాత్ములారా! లోకంలో వేమన అనే యోగి వెలసినాడు. అతన్ని పూజించండి. అట్టివారిని పూజించుట వలన మనుజులకు భుక్తిముక్తులు కలుగుచున్నవి. ఓ విశ్వదాభిరామ వేమా! వినుము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు