Pages

Sumati Satakam - పుత్రోత్సాహము తండ్రికి

సుమతీ శతకము - పుత్రోత్సాహము తండ్రికి
పుత్రోత్సాహము తండ్రికి 
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా 
పుత్రుని కనుగొని పొగడగ  
పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !

భావము : ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు 
               గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన 
               సంతోషము కలుగును. 

2 comments:

  1. నాలుగవ పాదములో ఒక లఘువు తగ్గినట్లుగా వుంది.
    పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ అని ఉండాలి, అపుడే సరిగా వుంటుంది. Am I right?
    --- PSR Murthy

    ReplyDelete
    Replies
    1. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! - yes, you are right.

      Delete

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు