Pages

Sumati Satakam - లావుగల వానికంటెను


లావుగల వానికంటెను
భావింపక నీతిపరుడు బలవంతుడౌ
గ్రావం బంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!

అర్థాలు : లావు = బలం ; గ్రావం = కొండ ; గజం = ఏనుగు ; మావటి = ఏనుగును తోలేవాడు.

బావం : బలంగల వానికంటే నీతిగా ప్రవర్తించే వాడే మిక్కిలి బలవంతుడు. ఏనుగు బలమైనదే, కాని దానిని కూడా        నేర్పుతో అదలించి నడుపగలవాడు మావటివాడు. ఆకారం కంటే బుద్ధికుశలత ప్రధానమని భావం.

1 comments:

  1. బలవంతుండౌ అని ఉండాలి అనుకుంటా. లేకపోతే ఒక లఘువు తగ్గుతుంది. . Am I right?
    --- PSR Murthy

    ReplyDelete

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు