Pages

ఉగాది - బాలల గేయం 5

వసంత కాలపు ఉగాదికి
కోకిల పలికెను ఆహ్వానం
వేప, మామిడి పూతలతో
తరువులు ఇచ్చెను బహుమానం

పెద్దలు పిల్లలు సందడితో
అభినందనలు తెలిపారు
ఉగాది పచ్చడి చేయుటకై
అమ్మ , అక్కలు కలిశారు
వేపపూతను కోశారు
చెరకు రసాన్ని తీశారు
మిరియపు కారం వేశారు
చిటికెడు ఉప్పు చేర్చారు

మామిడి పిందెలు తురిమారు
చింత పులుసులో కలిపారు
తీపి , కారం , పులుపు , చేదు
ఉప్పు , వగరు రుచులే రుచులు
ఆరు రుచులతో పచ్చడిచేసి
అందరు మెచ్చగ పంచారు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు