Pages

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు - భర్త్రహరి సుభాషితం - 4

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు కలుషమడచు
కీర్తి ప్రకటించు చిత్తవిస్పూర్తి జేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు

భావం : మంచివారితో స్నేహం బుద్ధిమాంద్యంను పోగొట్టును. సత్యవాక్యములనే పలుకునట్లు చేయును.మనస్సును నిర్మలం చేయును. దిక్కుల యందు కీర్తిని వ్యాపింపజేయును. అది సకల ప్రయోజనములను కలుగజేయును.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు