Pages

మా ఇల్లు - గేయాలు 2

స్తారా మా ఇంటికి మీరు
ఇస్తా ఎన్నో బొమ్మలు మీకు
వేపచెట్టుపై కోకిల ఉంది
కమ్మని పాటలు పాడుతుంది
జామచెట్టుపై ఒక ఉడతుంది
పైకీ కిందికి పరుగెడుతుంది
ఇంటిచూరులో పిచ్చుకలున్నాయ్
కిచకిచమంటూ తుర్రుమంటాయ్

టామీ, జానీ కుక్కపిల్లలూ
జట్టుకడితే వదలవు మిమ్ము
చిట్టీ కిట్టి పిల్లులండీ
చెప్పలేని అల్లరండీ
బుజ్జీ బుజ్జీ కుందేళ్ళు
బుద్ధిగ తిరిగే నేస్తాలు
మామిడి చెట్టుకు ఉయాల ఉంది
ఊగుతు పాడుదాం రారండీ 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు