Pages

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ - భర్త్రహరి సుభాషితం - 3

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.

భావం : పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు