శివడద్రిని శయనించుట,
రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషుని పై
బవళించుట నల్లిబాధ పడలేక సుమీ.
శివుడు హిమాలయ పర్వతం మీద శయనిస్తాడు. సూర్యుడు , చంద్రుడు ఆకాశంలో ఉంటారు. విష్ణుడెప్పుడు పాలసముద్రంలో శేషతల్పం మీద పడుకుంటాడు. వీరంతా భూమి మీద ఉండకుండా ఆయా చోట్ల ఉండడం నల్లికి భయపడే - అని చమత్కారం. మనం పడే నల్లి బాధ ఎంత భయంకరమైనదో తెలియచెప్పడానికి ఇంత గొప్ప దేవతలు కూడా నల్లి బాధ పడలేకనే అటువంటి నివాసాలు ఏర్పరచుకున్నారని ఒక కవి చమత్కారం.

0 comments:
Post a Comment