Pages

రాజును రాజుగా డతడు రాహు ముఖంబున జిక్కె వాహినీ - చమత్కార పద్యం 6

రాజును రాజుగా డతడు రాహు ముఖంబున జిక్కె వాహినీ
రాజును రాజు గాడతడు రామ శరాహతి దూలె, దేవతా
రాజును రాజు గాడతడు రావణనూఇకి నోడె నాజిలో;
రాజని రాజు మల్కియిభరాముడె రాజు ధరాతలంబునని.
రాహువు మింగుతాడు కాబట్టి పేరుకు రాజే కాని నిజముగా చంద్రుడు రాజు కాదు.నదులన్నిటికీ రాజైన సముద్రుడు కూడా రాజు కాదు.ఎందుకంటే రాముడు విల్లెక్కు  పెట్టగానే వణికిపోయాడు.దేవతల రాజైన ఇంద్రుడు కూడా రాజు కాదు.ఎందుకంటే రావణుని కుమారుడైన మేఘనాథుని చేతిలో ఓడిపోయాడు.మరి యుద్దములో నిజమైన రాజు ఎవరు?ఈ ప్రపంచంలో ఇబ్రహీం కుతుబ్షయే  నిజమైన రాజు.అంటే రాజు అన్నపదానికి అతడే తగినవాడు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు