Pages

చమత్కార పద్యం -4

ఇలలో నిద్దరు రాజులు
మలయుచు( జదరంగ మాడి సూపటివేళన్
బల మెత్తి కట్ట మరచిన
నెలుకలు తమ కలుగులోని కేసుగునిడ్చెన్.
ఎలుకలు తమ కన్నంలోనికి ఏనుగును ఈడుచ్చుకేల్లాయి అనే మరో సమస్యా పూరణం ఇది. ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు.రాత్రి అయింది.బలాన్ని(చదరంగబలం) ఎత్తి కట్టకుండా ఎలా ఉన్నవలానే వదిలేశారు. ఆ చదరంగ బలంలోని ఏనుగును ఎలుకలు తమ కన్నంలోనికి ఈడుచ్చుకొనిపోయాయి.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు