Pages

చమత్కార పద్యం -1

ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు
కంటమందు నలుపు! కాడు శివుడు!
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా?కాదు.
దీనిభావమేమి తెలుసుకొనుడు.
ఇది పద్యరూపంలో ఉన్న పొడుపు కథ. ఒళ్ళంతా కళ్ళుంటాయి కాని ఇంద్రుడు కాడు. మెడ నల్లగా ఉంటుంది కాని శివుడు కాడు. పాములను పట్టి చంపగలడు కాని పక్షి రాజు గరుడు కాదు. ఇదేమిటి ?(నెమలి )

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు